ఆగస్టు 26.27.28 తేదీలలో జరిగే వ్యకాస రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయండి.
కాంగ్రెస్ ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలి.
వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12000
ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి.
వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు
మీ న్యూస్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్
సూర్యాపేట: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆగస్టు 26,27,28 తేదీలలో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నాయని ఈ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలనితెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట నియోజకవర్గ స్థాయిసమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ వ్యవసాయ కుటుంబాలను ఆదుకోవడం కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్న నేటికీ ఎన్నికల వాగ్దానం అమలుకు నోచుకోలేదని ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇల్లు లేని వ్యవసాయ కార్మిక పేదలందరికీ ఇంటి స్థలము ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములలో ఇంటి స్థలములేని లక్షలాది మంది పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తుంటే గుడిసెలు తొలగించి వారిపైన తప్పుడు కేసులు పెట్టి జైల్లో వెస్తున్నారని ఆ విధానాన్ని వెంటనే విడనాడి అర్హత కలిగిన పేదలందరికీ పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని అలాగే పేదలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 2012 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల వేతనాలు పెంచడం కోసం కనీస వేతన జీవోను తీసుకురావడం జరిగిందని,రెండు సంవత్సరాలకు ఒకసారి వేతన జీవోను సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీల వేతనాలు పెంచడం కోసం వచ్చిన జీవోను కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలమంతా సవరించలేదని వ్యవసాయ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్ కు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని, గుర్తు చేశారు .కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వేతన జీవోను సవరించి రోజు కూలి 600 రూపాయలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు నమ్మి వ్యవసాయ పేదలంతా కాంగ్రెస్ కు ఓటు వేశారని కానీ నేటికీ ఆ జీవోను సవరించలేదుఅన్నారు. కొత్త జీవోను తీసుకువచ్చి వెంటనే కొత్త వేతన జీవోను అమలు చేయాలని కోరారు.గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఆర్థికంగా అభివృద్ధి కావడానికి వేతనాలు పెంచాలని రెవెన్యూ అధికారుల ద్వారా గ్రామసభలు నిర్వహించి కూలీలకు న్యాయం చేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వ్యవసాయ కార్మిక రంగానికి సంబంధించిన నిధులు పెంచడంలో ఉపాధి హామీ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు 15 శాతం కేటాయించాల్సి ఉండగా , నూటికి డెబ్బై శాతం ఉన్న ఆ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం పెత్తందారులకు కాంట్రాక్టర్లకు బడ్జెట్లో పెద్దపీట వేసి దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న వ్యవసాయ కార్మిక రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా విస్మరించడం జరిగిందని, ఉపాధి హామీ చట్టానికి రెండున్నర లక్షల కోట్లు కేటాయించాల్సి ఉండగా నామమాత్రం కేటాయింపులతో చేతులు దులుపుకున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్త ఉద్యమాలకు వ్యవసాయ కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.