మృతుని కుటుంబానికి అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన ప్రముఖులు 

Uncategorized అంతారం తాండూర్ రాజాకియం వికారాబాద్

మృతుని కుటుంబానికి అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన ప్రముఖులు 

 డబ్బులు అందజేసిన నాయకులు
 మాజీ ఎంపిటిసి శాంత్ కుమార్ 
మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రకాష్ 
 మాజీ ఉప సర్పంచ్ జీవరత్నం 
 కోస్గి ఆశప్ప బొడ్డే అనంతయ్య

 

  బివిజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్  
 మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ 

 

 మీ న్యూస్ ప్రతినిధి::: అంతారం గ్రామంలో కుర్వ రమేష్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన డాక్టర్ సంపత్ కుమార్ తాండూరు మండలం అంతారం గ్రామనీ చెందిన కుర్వ రమేష్ గత కొన్ని రోజుల నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించాడు.కుర్వ రమేష్ మరణించిన విషయాన్ని గ్రామ మాజీ ఉప సర్పంచ్ జీవరత్నం, మాజీ మార్కెట్ డైరెక్టర్ ప్రకాష్, మాజీ ఎంపీటీసీ శాంత కుమార్, బోయిని అమ్రేష్, డాక్టర్ సంపత్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు, దీంతో తాండూరు బాలాజీ ఆసుపత్రి అధినేత బివి జి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ తన అభిమానుల ద్వారా మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వండే శ్రీనివాస్ తాను అందుబాటులో లేకపోయినా తన పార్టీ నాయకులతో మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోస్గి ఆశప్ప, బొడ్డే అనంతయ్య, సంఘం శ్రీనివాస్, కోటయ్య, నారాయణ గౌడ్, తలారి వెంకటయ్య, డ్రైవర్ శ్రీను, లాలయ్య, అజంత, కుటుంబ సభ్యులు ప్రజలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు