మండలంలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి.రాంబాబు

Uncategorized నల్లగొండ మోతే సూర్యాపేట

మండలంలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి.రాంబాబు

మీ న్యూస్ మోతే మండల ప్రతినిధి జనవరి 17:::మండలంలో పరిధిలోని రాఘవాపురం, నామవరం గ్రామాలలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి. రాంబాబు శుక్రవారం మండలంలోని రాఘవపురం గ్రామం నందు జరుగుతున్న నాలుగు సంక్షేమ పథకాల సర్వేలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. రాఘవపురం లోని సర్వే నెంబరు 161 లో గల భూములను అదనపు కలెక్టర్ పరిశీలించారు. క్వారీ ఉన్న ఏరియా కూడా గతంలో రైతుబంధు వచ్చినట్లుగా గుర్తించడం జరిగిందని ఇప్పుడు జరుగుతున్న సర్వేలో వ్యవసాయేతర భూములను పరిశీలించి అట్టి వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం జరుగుతుందని తెలిపారు. నామవరం గ్రామంలో సర్వే జరుగుతున్న విధానాన్ని పరిశీలించి సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సంఘమిత్ర, ఎంపీడీవో ఆంజనేయులు, ఆర్ ఐ నిర్మల ,ఏఈఓ ప్రియాంక ,పంచాయతీ సెక్రెటరీ వై మౌనిక అధికారుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.