సూర్యాపేట పట్టణంలో ఉప్పుల మన్సూర్ గారి విగ్రహాన్ని పెట్టాలి
మీ న్యూస్ మోతే మండల ప్రతినిధి జనవరి 13:: మోతే మండలం సిరికొండ గ్రామంలో కామ్రేడ్ ఉప్పుల మన్సూర్ గారి నిలువెత్తు విగ్రహాని కి MCPIU సూర్యాపేట జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు కంపాటి శ్రీను పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.మోతే మండలం సిరికొండ గ్రామంలో కామ్రేడ్ ఉప్పుల మన్సూర్ గారి 26వ వర్ధంతి సందర్భంగా ఎం సి పి ఐ యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న మాట్లాడుతూ మోతే మండలం సిరికొండ గ్రామంలో పుట్టిన కామ్రేడ్ ఉప్పల మన్సూర్ సూర్యాపేట నియోజకవర్గానికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికై నాలుగు సార్లు మడమతిప్పని ప్రజాప్రతినిధిగా కామ్రేడ్ ఉప్పల మన్సూర్ నీతి నిజాయితీకి మారుపేరుగా మాటమీద నిలబడే వ్యక్తిగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పైసా కూడా పెట్టని నాయకుడు కామ్రేడ్ ఉప్పల మన్సూర్. చివరకు సిరికొండ సర్పంచిగా ఎన్నికై తన వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించినటువంటి మహానాయకుడు కామ్రేడ్ ఉప్పల మన్సూర్ అంతటి నాయకుని విగ్రహాన్ని జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో నెలకొల్పాలని వారు ప్రభుత్వ ని కి విజ్ఞప్తి చేశారు. తను నివాసం ఉంటున్న ఇంటి స్థలం ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చినటువంటి త్యాగదనుడు.కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి మద్ది కాయల ఓంకార్ గారి ఆశయాలు తీసుకుని ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేసినటువంటి నాయకుడు అంతటి నాయకునికి వారి కుటుంబానికి ఇప్పుడు నిలువు నీడ లేనటువంటి పరిస్థితి .చాలామంది నాయకులు వచ్చి పరమార్శించి వెళ్తారే కానీ వారికి తగు న్యాయం చేయలేదు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేసి ఆదుకోవాలని MCPIU విజ్ఞప్తి చేస్తుంది. MCPIU జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ మాట్లాడుతూ నేడు ఏ చిన్న అవకాశం వచ్చినా కోట్లకు పడిగెత్తి నాయకులు ఉన్న ఈ రోజుల్లో కామ్రేడ్ ఉప్పుల మన్సూర్ గారు తను నమ్మిన సిద్ధాంతం కొరకు పాటుపడుతూ తను చివరి వరకు ఆటోలో బస్సులో ప్రయాణిస్తూ ప్రజా కార్యక్రమాలలోపాల్గొంటూ శాసనసభకు ఆటోలోనే పోయి తన వానిని వినిపించిన మహా నాయకుడు కామ్రేడ్ ఉప్పల మన్సూర్ రని నేటి యువత వారి ఆశయాలను తీసుకొని ముందుకు పోవాలని అన్నారు.ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు కాంపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ మారుమూల గ్రామమైన సిరికొండలో పుట్టి రాష్ట్రవ్యాప్తంగా అణగారిన వర్గాల ప్రతినిధిగా 30 సంవత్సరాలు ఎన్నికయి నిస్వార్థ జీవితాన్ని అనుభవించిన కామ్రేడు ఉప్పుల మన్సూర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డులో ప్రతిస్తించి వర్ధంతి ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు వారి కుమార్తె సంపంగి కొమరక్క పార్టీ నాయకులు ఉప్పుల పూలమ్మ పుష్పలత సువర్ణ నవీల వెంకన్న ఈరి అంజయ్య బుర్ర కోటయ్య కాంపాటి జానయ్య ఉప్పల నాగయ్య ఉప్పల గోపయ్య తదితరులు పాల్గొన్నారు