అధ్యాపకుల సంఘం వికారాబాద్ జిల్లా ఇన్చార్జిగా తాండూర్ కళాశాల అధ్యాపకుడు
తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ లో వికారాబాద్ జిల్లా ఇన్చార్జిగా తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడికి స్థానం దక్కింది.
మీ న్యూస్ ప్రతినిధి జనవరి 01::::హైదరాబాదులో ఆ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ మేరకు వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఇంగ్లీష్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ ను వికారాబాద్ జిల్లా ఇన్చార్జిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ఇన్చార్జిగా నియామక పత్రం అందజేసిన సందర్భంగా అధ్యాపకుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కు, రాష్ట్ర అధ్యక్షులు కాముని సుదర్శన్ కి ధన్యవాదాలు తెలియజేశారు.పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న స్కాలర్షిప్లు , తదితర ప్రోత్సాహకాల పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని,
లెక్చరర్ల సమస్యల సాధనకు సంఘం తరఫున పోరాటం చేస్తానని, బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు శ్రీనివాస్ గౌడ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.