రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చిన ఏడవ గ్యారంటీని వెంటనే అమలు చేయాలి
ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ఎర్ర జెండా చూస్తూ ఊరుకోదు
ఎర్ర జెండా రోజులు మళ్లీ వచ్చాయి
సిపిఎం సూర్యాపేట జిల్లా మహాసభ ముగింపు సభలోసిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 2:: సూర్యాపేట: రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చిన ఏడవ గ్యారంటీని వెంటనే అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారంసూర్యాపేట జిల్లా కేంద్రంలో సుమంగళి ఫంక్షన్ హాల్ (మల్లు స్వరాజ్యం నగర్, ఉప్పల కాంతారెడ్డి ప్రాంగణంలో)లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టి పెళ్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి,దండ వెంకటరెడ్డి, మద్దెల జ్యోతి అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన సిపిఎం సూర్యాపేట జిల్లా ముగింపు మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనేరాష్ట్రంలోస్వేచ్ఛ ఉంటుందనిసచివాలయానికి ఉన్నగేట్లనుతొలగించారనిరాష్ట్ర ప్రజలకు ఏడవ గ్యారెంటీ అయినా స్వేచ్ఛను ప్రజలకు అందిస్తారని చెప్పినేడు మాత్రం కెసిఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులనుఅక్రమంగా అరెస్టు చేస్తూ వారిపై కేసులు పెడుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 11 మాసాలు అవుతున్న నేటికీ ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేయలేదన్నారు. రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ,రైతు భరోసా,వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000, మహిళలకు 2500,పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సహాయం వంటి హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. హామీల అమలుకు బలమైన పోరాటాలు నిర్మిస్తామని హెచ్చరించారు.
*సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్* *రావు* మాట్లాడుతూ కేంద్రంలో గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతుందని ఆరోపించారు. అంబానీ, ఆదాని ని లకు రాయితీలు ఇస్తూ పేదలపై అనేక భారాలు మోపుతున్నారని విమర్శించారు. లాభాలలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దేశంలో ఉన్న మెజార్టీ ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే అంబానీ ఆధానీల ఆస్తులు మాత్రం వేల కోట్లకు పెరుగుతున్నాయని అన్నారు. బిజెపి దేశంలో అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాల కాలంలో ప్రజలపై మత భావాలను రుద్దుతూ దేశంలో ఐక్యంగా ఉన్న హిందూ, ముస్లిం, క్రైస్తవ, దళితుల మధ్యన చిచ్చు పెడుతూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని విమర్శించారు. *సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి* మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలపై ధరల భారం పడుతుందన్నారు. మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు మహిళలు పట్ట పగలు కూడా నడిచే పరిస్థితి లేదన్నారు. మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులను నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలోసరైనటువంటితిండి లేక మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు పెరిగిన అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరల మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అయంత వరకుప్రజా పోరాటాలకుప్రజలు సిద్ధం కావాలని ప్రజలకు ఎర్రజెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ మహాసభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులుచెరుపల్లి సీతారాములు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, సిపిఎం జిల్లా కార్యదర్శిమల్లు నాగార్జున రెడ్డి,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కో లిశెట్టి యాదగిరిరావు, పారేపల్లి శేఖర్ రావు, మట్టిపల్లి సైదులు, నాగారపు పాండు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల రవి, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లుతదితరులు పాల్గొన్నారు.