అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు

సూర్యా పేట జిల్లా మీ న్యూస్ ప్రతినిధి  ::: అర్హులైన వారిని గుర్తించేందుకే ఇందిరమ్మ ఇల్లుల సర్వే చేపట్టడం జరుగుతుందని మండల ప్రత్యేక అధికారులు తప్పకుండా వారానికి రెండు సార్లు సర్వే వివరాలపై సమీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణి లో అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత శాఖ అధికారులకి పంపించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కరించాలని సూచించారు. ఫిబ్రవరి23 న జరిగే గురుకులాల్లో 5 వ తరగతి ప్రవేశ పరీక్ష పై అలాగే ట్రైబల్, సాంఘీక సంక్షేమ పాఠశాలలో 6,7,8 వ తరగతి లలో బ్యాక్ లాక్ ప్రవేశాలకి ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించడానికి నికి చ పిబ్రవరి 1 చివరి తేదీ అన్నారు. అని గురుకుల ప్రవేశ పరీక్షపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ప్రత్యేక అవగాహన కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారికి కలెక్టర్ సూచించారు.

తదుపరి పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి వారి జాతర ఏర్పాట్ల పై వివిధ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖ లు సమన్వయం చేసుకుంటూ జాతర ని విజయవంతం చేయాలని సూచించారు.జాతర కొరకు 70 ఎకరాల స్థలం గుర్తించటం జరిగిందని ఆర్డీఓ సూర్యాపేట తెలిపారు. జాతర కి సంబందించిన అన్ని ఏర్పాట్లు సూర్యాపేట ఆర్ డి ఓ సూపర్ వైజ్ చేయాలని కలేక్టర్ తెలిపారు.

గుట్ట పై భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ ఏర్పాటు చేయాలని, ఎండ తగ్గలకుండా చల్లని చలువ పందిరి ఏర్పాటు చేయాలని, గుడి చుట్టూ కలరింగ్ లైట్స్ ఏర్పాటు చేయాలని దేవాదాయ అధికారులకి సూచించారు.శానిటేషన్ సమస్య లేకుండా ఎక్కువ మంది సిబ్బంది ని, వ్యర్థ పదార్దాలను తరలించుటకు ఎక్కువ ట్రాలీలను ఏర్పాటు చేసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అలాగే భక్తులకి త్రాగునీటి సమస్య లేకుండా మిషన్ భగీరథ అధికారులు, మున్సిపల్ అధికారులు సమన్వయం చేసుకుంటూ త్రాగు నీటి వసతి ఏర్పాటు చేయాలని సూచించారు.ఆప్రోచ్ రోడ్లు త్వరగా పూర్తి చేయాలని , కోనేరు వద్ద కలర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు.ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఎలాంటి వ్యాధులు ప్రభలకుండా డాక్టర్లను, స్టాప్ నర్సులను, సిబ్బంది ని,అంబులెన్సు అలాగే అన్ని రకాల మందులు ఏర్పాటు చేసుకోవాలని డి యం హెచ్ ఓ కి సూచించారు.

గుట్ట పైన,కింద సి సి కెమెరా లు ఏర్పాటు చేయాలని,జాతర జరిగే ఐదు రోజులు 24 గంటలు పని చేసే విధంగా చూడాలని తెలిపారు.జాతర లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీ కేడింగ్ లు,భద్రత ఏర్పాట్లు చేయాలని డి ఎస్ పి రవి కి సూచించారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకి ఆర్ టి సి బస్సులు ఏర్పాటు చేసి గుట్ట దగ్గరలో బస్టాండ్ ఏర్పాటు చేయాలన్నారు.

గుట్ట చుట్టూ గుర్తించిన 70 ఎకరాలలో భక్తులకి ఎలాంటి ఆటంకం లేకుండా లైటింగ్ ఏర్పాటు చేయాలని అలాగె జనరేటర్స్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. షాప్ లకి, వీధి లైట్లకు వేర్వేరు ఫిడర్స్ ఏర్పాటు చేసి విద్యుత్ నిరంతర సరఫరా చేయాలని అధికారులకి సూచించారు.

జాతర లో విధులు నిర్వహించే సిబ్బందికి ఐ డి కార్డులు ఇచ్చి హాజరు నమోదు చేసుకోవాలని అధికారులకి తెలిపారు.

జాతర లో ఏర్పాటు చేసే హోటల్స్, పాస్ట్ పుడ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని పుడ్ కమిటీ ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. తూనికలు కొలతలు లో తేడా లేకుండా, ఎక్కువ ధరలకి విక్రయించకుండా దుకాణలపై నిఘా పెట్టాలని అలాగే పైరింజన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా మీడియా పాయింట్, ఛాయా చిత్ర ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.

ప్రజావాణి లో మొత్తం 70 దరఖాస్తు లు వచ్చాయని రెవిన్యూ శాఖ కి సంబంధించి 27 ధరఖాస్తులు,జిల్లాలోని వివిధ ఎం పి డి ఓ లకి 10 దరఖాస్తులు,

డి ఆర్ డి ఎ కి 8 దరఖాస్తులు, మిగిలిన 25 దరఖాస్తు లు వివిధ శాఖ లకి వచ్చాయని వాటిని పరిష్కరించుటకి సంబంధిత అధికారులకు పంపించటం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమం లో డి ఆర్ ఎ పి డి వి వి అప్పారావు, డి ఎఫ్ వో సతీష్ కుమార్ ,సూర్యాపేట ఆర్ డి ఓ వేణు మాధవ్, డి ఎస్ పి రవి,డి యం హెచ్ ఓ కోటాచలం, డి ఈ ఓ అశోక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సుపారీటిడెంట్లు పద్మారావు, సాయిగౌడ్, శ్రీలత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.