రాజన్న జన్మదిన వేడుకలు

Uncategorized తాండూర్ పుట్టినరోజు వేడుకలు పేద్దేమూల్ బషీరాబాద్ యాలల రాజాకియం వికారాబాద్

రాజన్న జన్మదిన వేడుకలు

బీ సీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

పట్టణ మరియు పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు

పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు  వివిధ కుల సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 23:::: తాండూరు పట్టణంలో జాతీయ బిసి సంఘం కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా తాండూర్ పట్టణంలో స్థానిక ఎంపీటీ ఫంక్షన్ హాల్ లో శంకర హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌకర్యంతో గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి దాదాపు 300 పైగా మందికి వైద్యులు కంటి పరీక్షలు చేశారు.

 

 మాతా శిశు ఆసుపత్రిలో అల్పాహారం పంపిణీ:::

 స్థానిక జాతీయ బిసి సంఘం కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా బీసీ సంఘం యువ నాయకులు రాము ముదిరాజ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఉదయం మాతా శిశు ఆసుపత్రిలో అల్పాహారం పంపిణీ చేశారు. ముదిరాజ్ సంఘం సభ్యులు.

అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు టిఫిన్ బాక్స్ వాటర్ బాటిల్ పంపిణీ::

అనిత రమేష్ టైలర్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని మల్రెడ్డిపల్లి మరియు ఇందిరానగర్ అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు టిఫిన్ బాక్స్ మరియు వాటర్ బాటిల్ పంపిణీ చేయడం జరిగింది.

 విద్యార్థులకు ఎగ్జామ్ పాడ్స్, పెన్నులు, స్కేల్ పంపిణీ

బషీరాబాద్ మండల అధ్యక్షులు నరేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో రెడ్డి ఘనపూర్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలకు ఉపయోగపడే వస్తువులు ఎగ్జామ్ పాడ్స్, పెన్నులు, స్కేల్ జన్మదిన సందర్భంగా పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ స్థానికంగా నిర్వహించిన కంటి వైద్య శిబిరం గురించి కొని ఆడారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అభినందించారు.  పట్టణ ప్రముఖులు వ్యాపారవేత్తలు కుల సంఘాల నాయకులు వివిధ రాజకీయ నేతలు జాతీయ బిసి సంఘం కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ శుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మండలాల అధ్యక్షులు, లక్ష్మణాచారి, నరేందర్, బసంత్ కుమార్, శ్రావణ్ కుమార్, ప్రముఖ వ్యాపారవేతలు కోహిర్ రాజు, నితిన్ సోమని, రవి రాజ్, గ్లోబల్ యువతరం సభ్యులు మంబాపురం విజయేందర్, అరుణ్ రాజ్, రాజకీయ మరి కుల సంఘాల నాయకులు బంటు మల్లప్ప, హనుమంతు ముదిరాజ్, బీసీ సంఘం మహిళా నాయకులు, జ్యోతి, అనిత, మంజుల, నరసమ్మ, రాజ్ కుమార్ మిత్ర బృందం సభ్యులు ప్రేమ్ కుమార్, జోసఫ్, హరి చల్ల, కోటాం సిద్ధి లింగం, బీసీ యువ నాయకులు బసవరాజ్, రాము ముదిరాజ్, జంటుపల్లి వెంకట్, టైలర్ రమేష్, తాండ్ర నరేష్, మంతటి రాజు, శివకుమార్, పరమేష్,గిర్జపూర్ రమేష్, పండు గౌడ్, దుబాయ్ వెంకట్, హరి ప్రసాద్, అనిల్, అమ్రేష్, నరహరి తదితరులు పాల్గొన్నారు.