బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసి వృధా చేసుకోవద్దు
-మల్కాపూర్ బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
-తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
మీ న్యూస్ తెలుగు

బీ జేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసి వృధా చేసుకోవద్దని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సూచించారు.ఆదివారం తాండూరు మండలం మల్కాపూర్ మీటింగ్స్ లో పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగాఘనపూర్ మౌలానా, నరసింహ వీరి ఆధ్వర్యంలో సుమారు 30 నుంచి 40 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.అనంతరం రోహిత్ రెడ్డి మాట్లాడారు. గ్రామంలో ఉండే కార్యకర్త నుంచి మొదలుకుని సీఎం రేవంత్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీ నాయ కులు సిగ్గు, భయం లేకుండా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నా మంటూ అబద్దాలు చెబుతూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్సోళ్లకు పథకాలు గుర్తుకు వస్తాయని, ఎన్నికల తర్వాత పథకాల అమలుకు వాయిదాలు వేస్తారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసి వృథా చేసుకోవదన్నారు.మీకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అండగా ఉంటాడని,భవిష్యత్ తరాలను ద్రుష్టిలో పెట్టుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్,ఉమాశంకర్,రాకేష్ గౌడ్,షాంసోద్దీన్, హసన్ పటేల్ ,తదితరులు పాల్గొన్నారు.