ప్రజాపాలన విజయోత్సవా వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

ప్రజాపాలన విజయోత్సవా వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినం 

 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 9 :: ప్రజాపాలన విజయోత్సవ చివరి రోజు కావటంతో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా మోతే మండల కేంద్రంలో కేక్ కట్ చేసి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారి మరియు కోదాడ నియోజకవర్గ శాసన సభ్యురాలు ఉత్తం పద్మావతి రెడ్డి గారి ఫోటో కి పాలభిషేకం చేసి మిఠాయిలు పంచటం జరిగింది.టపాసులు కాల్చి ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు.మోతే మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొడ్డు సాలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో పేద ప్రజల కోసం చేసిన మంచి పనులను వివరించారు.రైతు రుణమాఫీ,ఆర్టీసీ బస్ లో మహిళలకి ఉచిత ప్రయాణం,ఆరోగ్యశ్రీ,ఇందిరమ్మ ఇళ్లు,ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకి అండగా ఉంటుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో మోతే గ్రామ శాఖ అధ్యక్షులు బొక్క ఉపేందర్ రెడ్డి,మండల కాంగ్రెస్ నాయకులు ఐత బోయిన వెంకన్న,బొక్క లింగారెడ్డి,జలగం ఆంజనేయులు,జాని షరీఫ్,లింగాల వెంకన్న,బొల్లాం నారాయణ,రాపర్తి కాట్టంరాజు,బొడ్డు లింగయ్య, నిమ్మనగోటి లింగయ్య,పెరమయ్య,దోసపాటి ఎల్లయ్య,కృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు అందెం నాగరాజు,దేశబోయిన నాగరాజు,నరేష్,మధు,మహేష్,ఉపేందర్,ఉమేష్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.