పిల్లలమర్రి శివాలయల్లో భక్తుల రద్దీ 

Uncategorized నల్లగొండ సూర్యాపేట

పిల్లలమర్రి శివాలయల్లో భక్తుల రద్దీ 

 మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట :కార్తికమాసం తొలి సోమవారం సందర్భంగా పిల్లలమర్రి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. భక్తులు భారీగా తరలివస్తుండటంతో రద్దీ నెలకొంది. రుద్రాభిషేకాలు, బిల్వార్చనల అనంతరం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుండే మహిళా భక్తులు కార్తిక దీపాలు వెలిగించి ఆ ఆదిదేవుని కృపాకటాక్షాలు తమపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎరకేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు సంతోష్ శర్మ పండ్లతో స్వామివారిని అందంగా అలంకరించారు.