హైడ్రా తో అమాయకుల ఆస్తులను ద్వంసం చెయ్యడం సరైంది కాదు.

Uncategorized జహీరాబాద్ రాజాకియం సంగారెడ్డి

హైడ్రా తో అమాయకుల ఆస్తులను ద్వంసం చెయ్యడం సరైంది కాదు.

హైడ్రా తో విధ్వంసాలు ఆపకపోతే అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వం పై దండయాత్ర చేస్తాం.

దొడ్ల వెంకట్ తెలంగాణ ప్రజాశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు.

మీ:: న్యూస్ ప్రతినిధి::తేలంగాణ ప్రజాశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దొడ్ల వెంకట్ మాట్లాడుతూ…రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాతో తెలంగాణ లో సామాన్యుల ఆస్తులను అన్యాయంగా ద్వసం చెయ్యడం సరైంది కాదని,సామాన్యలు సంవత్సరాలుగా కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని ఒక్క మంచి ఇంటిని నిర్మించుకుని హాయిగా జీవించే సమయంలో హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా పేద,మధ్యతరగతి కుటుంబాపై దాడులు చేసి ఇండ్లను నెల మట్టం చెయ్యడం చాలా దారుణం. పేద,మధ్య తరగతి ప్రజలపై కక్ష్య సాధింపు చర్యలు రాష్ట్ర ముఖ్యమంత్రికి తగదని, హైడ్రా ను ఉపసంహరించుకోకపోతే త్వరలో అన్ని పార్టీలతో కలిసి అసెంబ్లీ ముట్టడి చేస్తామని ఈ విధానాన్ని ప్రజాశక్తి పార్టీ పూర్తిగా ఖండిస్తుందని ఆయన అన్నారు. స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త బస్వరాజ్ పాటిల్ మాట్లాడుతూ…అధికారులే ఇండ్లు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చి హైడ్రా పేరుతో కూల్చడం ఏమిటని, ఇది నిజంగా ప్రజా ప్రభుత్వమా లేక ప్రజల ఉసురుపోసుకునే ప్రభుత్వమా అని ఆయన అన్నారు.ఈవిధానం ఇంకనైనా ఆపకపోతే అతి త్వరలోనే ప్రభుత్వం పై ప్రజలు దండ యాత్ర చేస్తారని ఆయన అన్నారు.అనంతరం పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాలిపటేల్ వీరేష్, జిల్లా ఇంఛార్జి బ్రహ్మ చారి,జిల్లా అధ్యక్షులు రవి,జిల్లా నాయకులు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.