అంటువ్యాధులు,విష జ్వరాల వారి నుండి ప్రజా ఆరోగ్యాన్ని రక్షించడంలో వైద్య ఆరోగ్య శాఖ విఫలం…..
సిపిఐ (ఎం) శాఖ మహాసభలో సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు విమర్శ
మీ:: న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కూర రవీందర్ గౌడ్::మోతే : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కులగనన చేపట్టి రిజర్వేషన్లు అమలుచేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మోతే మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో జరిగిన సిపిఐ(ఎం) గ్రామ శాఖ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన వెంటనే చేపట్టి స్థానిక సంస్థలకురిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీకాలం ముగిసి నాలుగు నెలలు కావస్తున్నా నేటికీ ఎన్నికలు నిర్వహించకపోవడం మూలంగా గ్రామాలలో ఎక్కడ సమస్యలు అక్కడపేరుకు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల మూలంగా నీళ్లు నిలువ ఉండటం మూలంగా ప్రతి ఇంట్లో జ్వర పీడుతులు ఉన్నారని, వారికి సరైన వైద్యం అందించడంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. మురికి నీరు నిల్వ ఉండటం మూలంగా దోమలు వృద్ధి చెంది ప్రజలు చికెన్ గునియా, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి జబ్బులకు గురై అల్లాడుతున్నారనిఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పారిశుద్ధ్య నిధులు వెంటనే విడుదల చేసి దోమలు వృద్ధి చెందకుండాచూడాలన్నారు. సంచార వైద్య బృందాల ద్వారా గ్రామాలలో విస్తృతంగా పర్యటించి ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించాలన్నారు. వైద్యంతో పాటు విస్తృతంగా టెస్టులుచేసి మందులు వారన్నారు. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లుఇవ్వాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ స్కీములను వెంటనే అమలు చేయాలని కోరారు. ఇటీవల వర్షాల మూలంగా కూలిపోయినఇండ్లకు, పంట పొలాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
సిపిఐ (ఎం) లో పలు కుటుంబాలు చేరిక…..
అనంతరం వివిధ పార్టీలకు చెందిన ఐదు కుటుంబాలు సిపిఐఎం పార్టీలో చేరారు.వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అనంతరం తుమ్మలపల్లి గ్రామ సిపిఎం కార్యదర్శిగా బుడిగే పిచ్చయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ నాయకులు ఎలిగి రెడ్డి వెంకట్ రెడ్డి, బాణాల ఉపేంద్ర చారి, రణబోతు వెంకటరెడ్డి, బాణాల బ్రహ్మచారి, ఎర్రం శెట్టి భాగ్యమ్మ, తమ్మర బోయిన భరత్, నగేష్, రణబోతు ఆది కేశవరెడ్డి, వీరయ్య,దేవారం కుశలవ రెడ్డి, నవిలే వీరయ్య తదితరులు పాల్గొన్నారు.