రోడ్డు పునర్నిర్మాణం చేపట్టాలిని ప్రభుత్వాన్ని డిమాండ్

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

రోడ్డు పునర్నిర్మాణం చేపట్టాలిని ప్రభుత్వాన్ని డిమాండ్

 పది కిలోమీటర్లు పాదయాత్ర

సిపిఐఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

మీ:: న్యూస్ ప్రతినిధి నూతనకల్,, మండల కేంద్రం నుండి తుంగతుర్తి మండల పరిధిలోని సంగెం వరకు గుంతల మయమైన రోడ్డును వెంటనే పునర్నిర్మాణం చేపట్టాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తుంగతుర్తి మండల పరిధిలోని సంగెం నుండి నూతనకల్ మండల కేంద్రం వరకు పది కిలోమీటర్ల కొనసాగే పాదయాత్రకు జండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ శాసనసభ సభ్యులు గాదరి కిషోర్ కుమార్ సంవత్సరం నర క్రితం ( 16 నెలల క్రితం) మండల కేంద్రం నుండి తిమ్మాపురం వరకు రోడ్డు మంజూర అయిందని 348 లక్షల నిధులు నిధులతో రోడ్డు పునర్నిర్మాణ పనులు చేపడుతామని శిలాఫలకం వేసి శంకుస్థాపన చేశారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న సామెత లాగా ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు, మారిన రోడ్డు నిర్మాణం జరగక ప్రయాణికుల అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గుంటలను పూడిపించి వెంటనే పునర్నిర్మాణం చేయకపోతే, పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈరోజు తాసిల్దార్ కు వినతి పత్రం అందజేస్తామని మరో రోజు కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ఈ గ్రామ ప్రజల మద్దతుతో ముట్టడి చేస్తామని అధికారులను హెచ్చరించారు. గుంతల మయమైన రోడ్డుతో వాహన శోధకులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికలకు ముందు శాసనసభ సభ్యులు మందుల సామేలు కు చిల్పకుంట్ల వెంకేపెళ్లి సంగెం ప్రజలు విన్నపించుకున్నారని గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో చిల్పకుంట్లలో సామెల్ కి 23 ఓట్ల పోలింగ్ ఐతే 1500కు పైగా ఓట్లు వేశారని 1040 ఓట్ల మెజార్టీని ఈ ఒక్క గ్రామమే అందించిందని, ఈ మెజార్టీ సాధించడానికి కారణం రోడ్డు మరమ్మతో హామీ నేనని గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం హామీలు విస్మరించడం సరైనది కాదని అన్నారు.ఇప్పటికైనా శాసనసభ సభ్యులు ప్రత్యేక కృషితో రోడ్డు నిర్మాణ పనులు ఇచ్చే పట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు, కమిటీ సభ్యులు పులుసు సత్యం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకట్ రెడ్డి,, రైతు సంఘం జిల్లా నాయకులు పల్లా సుదర్శన్, ప్రజానాట్యమండలి ఆల్ ఇండియా నాయకులు గోపి, మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి సిఐటియు మండల కార్యదర్శి బొజ్జ శ్రీనివాస్ , జిల్లా నాయకులు కల్లపల్లి భాస్కర్, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ చోడి మధుసూదన్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ తోణుకునూరు ఉప్పలయ్య, మండల నాయకులు అల్లిపురం సంజీవరెడ్డి బత్తుల జనార్ధన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి పులసరి వెంకట ముత్యం, సామ శ్యామ్ సుందర్ రెడ్డి , తొట్ల లింగయ్య బాణాల శివారెడ్డి ,ఉప్పల పరమేష్,, బత్తుల తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.