నేమ్స్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చే రైతులకు వెంటనే పరిహారం చెల్లింపు
మీ:: న్యూస్ ప్రతినిధి
నేమ్స్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చే రైతులకు వెంటనే పరిహారం చెల్లింపు జిల్లా డిప్యూటీ కలెక్టర్ మాధురినిమ్స్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చే రైతులకు పరిహారాన్ని వెంటనే అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ విభాగం డిప్యూటీ కలెక్టర్ మాధురి తెలిపారు. గురువారం న్యాలకల్ మండలం రేజింతల్ గ్రామంలో నేమ్స్ ప్రాజెక్ట్ భూసేకరణ లో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో 1650 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ప్రస్తుతం 450 ఎకరాలకు పైగా నేమ్స్ ప్రాజెక్టుకు సేకరించడం జరిగిందన్నారు. భూములు ఇస్తామని రైతులు ముందుకు వచ్చి అంగీకార పత్రాలను ఇస్తే వారికి వెంటనే పరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. వారికి పరిహారం కింద పట్టా ప్రభుత్వ భూములకు ఎకరానికి రూ. 15 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల రైతులు అంగీకార పత్రాలను సంబంధిత అధికారులకు వెంటనే అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జహీరాబాద్ నిమ్స్ ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ రవీందర్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ గడ్డం జనార్ధన్, సిబ్బంది గోకుల్, స్రవంతి, గ్రామ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు