సూర్యాపేట :నిర్మాణ రంగ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్ప చెప్పటాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 18న కలెక్టర్ కార్యాలయం ముందు 23న లేబర్ కమిషనర్ కార్యాలయం హైదరాబాద్ నందు పెద్ద ఎత్తున జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (CITU) రాష్ట్ర అధ్యక్షులు ఎస్,రామ్మోహన్అన్నారు. సూర్యాపేట కేంద్రంలోనిస్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వారు మాట్లాడుతూ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న తీరు బాధాకరమైన విషయమని ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా కాకుండా ప్రభుత్వం బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలను అందించాలని వెల్ఫేర్ బోర్డులో ప్రస్తుతం ఇస్తున్న సంక్షేమ పథకాలను పెంచాలని ప్రమాద బీమా 6 లక్షలను పది లక్షలకు పెంచాలని సహజ మరణానికి ఇస్తున్న లక్షను ఐదు లక్షలకు పెంచాలని దహన సంస్కారాలకు పెళ్ళికానుక ప్రసూతి సహాయమును లక్ష రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం 18న జరిగే జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా 23న జరిగే చలో హైదరాబాద్ కమిషనర్ ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ ధర్నాలను సూర్యపేట జిల్లా భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మన హక్కుల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు రాధాకృష్ణ,భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, అనంతల మల్లయ్య,యల్క సోమయ్య గౌడ్,గుంజ తిరుమలేశు, సోమపంగు రేణుక,జెడ్ సుజాత,వల్లపు శ్రీనివాస్,ఒగ్గు సైదులు, జడ్డు బాల శౌరెడ్డి, లింగయ్య, వేముల రాములు, దస్తగిరి,గంట ఎంకన్న, నాగరాజు, ఉప్పలయ్య, వెంకటేశ్వర్లు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.