హైస్కూల్లో ఘనంగా ఫేర్వెల్ పార్టీ 

Uncategorized మోతే వేడుకలు సూర్యాపేట

పదో తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీని ఘనంగా జరిపినారు

 •పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలు  

 •ఈ వేడుకల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు 

 

మీ న్యూస్ సూర్య పేట్ జిల్లా ఇంచార్జి:::

మోతే మండలం మామిళ్లగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్ లో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు విద్యార్థులందరూ ఆటపాటలతో నృత్యాలు పాల్గొన్నారు. ఈ వీడ్కోలు పార్టీని ఘనంగా సత్కరించు అలాగే త్వరలో జరగబోయే పదవ తరగతి పరీక్షలలో ఆ పాఠశాల నుంచి విద్యార్థులందరూ ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులందరూ కోరుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ జిల్లాలోని మా పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక బోధనతో పాటు మంచి శిక్షణ ఇచ్చి నైపుణ్యం గల విద్యార్థులను తయారుచేసినమని తెలిపారు. జిల్లాలోని మా పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఆశా బావ వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మామిల్లగూడెం ప్రధానోపాధ్యాయులు కే వెంకటరామ నరసయ్య, జి నిర్మల. పి నలిని, టి సంధ్యారాణి, ఏ వెంకట్రాంరెడ్డి, జీ.వి నరసింహారావు, ఏ సీనయ్య, డి శ్రీకాంత్ రెడ్డి, ఎం రేణుక, బి చాంప్ల. సిహెచ్ కవిత, ఎన్ వెంకన్న విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.