జిల్లా పోలీస్ కార్యాలయం నందు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
⏩:-జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ కె.నరసింహ ఐపీఎస్
మీ న్యూస్ ప్రతినిధి:-సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించడం జరిగినది జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు అందించారు.
సమాజంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతుంది అన్నారు, రాష్ట్ర అభివృద్ధి లో పోలీసులు కృషి చేస్తున్నారని తెలియజేశారు. సిబ్బంది అందరూ కర్తవ్య దీక్షతో పని చేయాలి, సంఘ విద్రోహుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. సామాన్య ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ సేవలు అందించాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పి రవిందర్ రెడ్డి, AR అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ DSP ప్రసన్న కుమార్, AR DSP నరసింహ చారి, AO మంజు భార్గవి గారు, CCS ఇన్స్పెక్టర్ శివ కుమార్, పోలీస్ సంఘం అధ్యక్షులు రామచందర్, సెక్షన్ సూపరింటెండెంట్ విజయ్, SI లు ఆంజనేయులు, ఏడుకొండలు, యాకూబ్, సైదులు, బాలునాయక్, శ్రీకాంత్, ప్రవీణ్ కుమార్, గోపి, RSI సురేష్, యం.అశోక్, కె.అశోక్, రాజశేఖర్, అన్వర్, ASI లు, ARSI లు, సిబ్బంది ఉన్నారు.