డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు

Uncategorized క్రైమ్ సూర్యాపేట

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు

⏩:-ఆరుగురికి జైలు శిక్ష

 ⏩:-12 మందికి జరిమానా

 ⏩:-సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం 

 మీ న్యూస్ ప్రతినిధి మే 26:-సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలోని పలు ప్రాంతాలలో వాహనాలు తనిఖీలు చేపట్టారు ఇందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ 18 మందిని పట్టుబడినట్లు ఎస్సై సాయిరాం తెలిపారు పట్టుబడిన వారిని ఈరోజు కోర్టుకు హాజరు పరచగా సూర్యాపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి శ్రీమతి బివి రమణ ఇద్దరికీ రెండు రోజులు మరో నలుగురికి ఒక్కరోజు జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి 2000 రూపాయల జరిమానా అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన మిగతా 12 మందికి 16,500 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడే వారికి చలనాలు విధించడంతోపాటు కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఎస్సై తెలిపారు