భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో మొదటి దశలో పాల్గొన్న కామ్రేడ్ పజ్జూరి
మీ న్యూస్ ప్రతినిధి::UCCRI( M-L) పార్టీ నాయకులుగా, నామవరం గ్రామంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో మొదటి దశలో పాల్గొన్న కామ్రేడ్ పజ్జూరి వెంకన్న మంగళవారం సాయంత్రం అమరులయ్యారు అని తెలియజేయడం కోసం చింతిస్తున్నాము. భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (మా-లే) తరపున పార్టీ నాయకులు కామ్రేడ్ పాలకూరి ఎల్లయ్య, కామ్రేడ్ తండు మల్సూర్ వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, సానిభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏనిగె రాంరెడ్డి, మండవ శీను,తుండు కృష్ణయ్య, మేరిగ పాపయ్య, మేరిగ గురవయ్య, వీరబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నామవరం గ్రామంలో భూస్వామి వ్యతిరేక పోరాటంలో మొదటి దశలో పార్టీ కార్యకర్తగా, గ్రామ కమిటీ కార్యదర్శిగా కామ్రేడ్ పజ్జురి వెంకన్న పని చేశారు. గ్రామంలో భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పాలేర్ల సమ్మె, రైతు కూలీల సమ్మెలో చురుకుగా పాల్గొన్నారు. వ్యవసాయ పనులు, పిల్లల చదువులు ఇతర కారణాల చేత వారు రాఘవపురం ఎక్స్ రోడ్డువద్ద స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ పట్ల పూర్తి విశ్వాసం కలిగిన కామ్రేడ్ పజ్జూరి వెంకన్న మరణించడం బాధాకరం. వారికి మా విప్లవ జోహార్లు అంటూ నివాళులు అర్పించిన నాయకులు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.