ప్రభంజనం సృష్టించిన సెంట్ మార్క్స్ విద్యార్థులు
⏩::జిల్లాలోనే టాపర్గా నిలిచిన ముజనా అకీల్ విద్యార్థిని
⏩::జిల్లాలో టాపర్గా నిలిచిన విద్యార్థి ని ముజనా అకీల్ కు స్కూల్ నుంచి ప్రోత్సాహక బహుమతిని అందజేశారు
⏩::విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు
గాండ్ల శివానంద్ 550/600
,అనీష్ ఫాతిమా 547/600,
ముసఫరా ఖతున్ 537/600,
జీబ్ ఆఫరా 535/600,
అద్నాన్ సమీద్ 534/600,
జె.సహస్ర 534 /600,
మీ న్యూస్ ప్రతినిధి::తాండూర్ పట్టణంలోని సెంట్ మార్క్స్ హైస్కూల్ పదో తరగతి ఫలితాలలో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లాలోనే టాపర్గా నిలిచారని స్కూల్ ప్రిన్సిపాల్ .రేవ్డ్ జి. ఆరోగ్య రెడ్డి పేర్కొన్నారు. బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల సంబరాలను గురువారం స్కూల్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రుల తో స్కూల్ ప్రిన్సిపాల్ ఆరోగ్య రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించి సంబరాలు జరిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానించి సత్కరించారు. అలాగే జిల్లాలో టాపర్గా నిలిచిన విద్యార్థి ని ముజనా అకీల్ కు స్కూల్ నుంచి ప్రోత్సాహక బహుమతిని అందజేశారు.. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆరోగ్య రెడ్డి మాట్లాడుతూ. విద్యార్థులకు కృషి తల్లిదండ్రుల ప్రోత్సాహం అధ్యాపకుల పట్టుదలతో ఇలాంటి విజయాలు సాధ్యమయ్యాయని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు 10 ఫలితాలలో జిల్లాలోని టాపర్గా రావడం అభినందనీయమని అన్నారు .ముజనా అకీల్ విద్యార్థిని 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి జిల్లాలోని టాపర్గా నిలిచిందని పేర్కొన్నారు .వీరితోపాటు గాండ్ల శివానంద్ 550/600,అనీష్ ఫాతిమా 547/600, ముసఫరా ఖతున్ 537/600, జీబ్ ఆఫరా 535/600, అద్నాన్ సమీద్ 534/600, జె.సహస్ర 534 /600,అలాగె మరో 8 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు.ఇలాంటి మార్కులు సాధించడం ఒక సెంట్ మార్క్స్ హై స్కూల్ కి సాధ్యమని అన్నారు మరోవైపు విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ స్కూల్ నిర్వాహకులు చేసిన కృషి విద్యార్థుల ఘనవిజయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు శ్రీలత ,అన్నపూర్ణ, అరవింద్, బాలస్వామి, వనిత, హేమలత, ఆనంద్ ,శరణ్ మరియు విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.
Post Views: 1,214