వక్స్ బిల్లును రద్దు చేసేంతవరకు ఐక్యంగా ఉద్యమించాలి
⏩:: ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట:మైనారిటీల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్స్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. మంగళ వారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మమత బాoకెట్ హాల్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన “వక్స్ సవరణ చట్టం2025- రాజ్యాంగ విరుద్ధం “అనే అంశంపై జరిగిన సెమినార్ కు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్స్ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు నియమించిన జేపీసీలో ప్రతిపక్ష సభ్యులు సూచించిన ఒక్క సవరణను కూడా ఆమోదించకుండా నియంతృత్వంగా ఆమోదించడం సరైనది కాదన్నారు. మంద బలంతో తీసుకున్న నిర్ణయాలను ఎటువంటి ప్రజాస్వామిక చర్చలు లేకుండా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని ప్రజాస్వామిక వాదులు మేధావులు ఖండించాలని కోరారు. భిన్నత్వంలో ఏకత్వం గల దేశాన్ని ఏకపక్ష విధానాలతో రాతి యుగాల లోకి నెడుతున్న కేంద్ర ప్రభుత్వ ధమన నీతిని ఖండించాలని కోరారు. విభజన విద్వేష రాజకీయాలు పెంచి పోషించే ఉద్దేశంతో తీసుకువచ్చిన వక్స్ బిల్లును వెనక్కి తీసుకునేంతవరకు జరిగే పోరాటాల లో సమాజంలో అన్ని వర్గాలు కలిసి రావాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షణకు తిలోదకాలు ఇచ్చి, ప్రజాతంత్ర హక్కులు కాలరాస్తూ, చట్టబద్ధ రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని కోరారు. వక్స్ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపా లని కోరారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, వక్స్ బిల్లును వెనక్కి తీసుకునేంతవరకు జరిగే పోరాటాలలో కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ మద్దతుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్ లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, ముస్లిం మత పెద్దలు మౌలానా ముజఫర్ అత్తర్ సాహెబ్, మమ్మద్ ఖలే ద్ అహ్మద్, ముక్తి మమ్మద్ అసలర్ సాహెబ్ , హమీద్ ఖాన్, మౌలానా నిజాముద్దీన్, ముక్తి హసన్, హఫీస్ హమ్మద్ ఖలీల్ అమ్మద్, ఫక్రుద్దీన్,ముక్తి హమ్మద్ అబ్రార్ సాహెబ్, సిద్ధిక్, షేక్ అబ్దుల్లా, హ ఫీస్ రియాజ్, హఫీస్ తాహెర్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జె.నరసింహారావు, వేల్పుల వెంకన్న, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, కందాల శంకర్ రెడ్డి, షేక్ సైదా, పులుసు సత్యం, బెల్లంకొండ సత్యనారాయణ, మేకన బోయిన శేఖర్, బచ్చలకూర స్వరాజ్యం, సిపిఎం సీనియర్ నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మేకన పోయిన సైదమ్మ, చిన్నపంగా నరసయ్య,సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, టూ టౌన్ కార్యదర్శి పిండిగా నాగమణి తదితరులు పాల్గొన్నారు.