ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి గ్రామీణ పేదల సంఘం

Uncategorized తెలంగాణ వ్యవసాయం సూర్యాపేట

ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి గ్రామీణ పేదల సంఘం

  చివ్వెంల మండలం చందుపట్లలో ధాన్యం కొనుగోలు సెంటర్ పరిశీలించి

మీ న్యూస్ ప్రతినిధి::జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య  మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పంట చేతికొచ్చే కల్లాలలో పోయడం జరిగింది కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరొక పక్కా అకాల వర్షాలు రావడంతో రైతులు ఆరుగాలం పండించిన పంట పరిస్థితి ఏమిటని వాపోతున్నారు అదేవిధంగా మార్కెట్ కు ధాన్యాన్ని తీసుకొని పోతే దళారులు కమిషన్ దారులు వడ్లకు సరైన ధర ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఐకెపి సెంటర్లు పి ఎ సి ఎస్ సెంటర్లో వెంటనే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని గ్రామీణ పేదల సంఘం ప్రభుత్వాన్ని కోరుతుంది.భాషిపంగు సునీల్ మాట్లాడుతూ రైతులు ఎస్సారెస్పీ నీళ్లు రాక అష్ట కష్టాలు పడి పండించిన పంటను ప్రభుత్వం వెంటనే కొనాలని ఉన్నారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంకన్న నల్లగొండ లింగయ్య కోడిబండ్లయ్య అభిమాల వెంకన్న సిగ రవి ఉప్పుల మల్లయ్య కొండ మల్లయ్య ఆరేబోయిన మల్లయ్య దండ మల్లయ్య బచ్చలకూరి పిచ్చయ్య పొత లింగం భూక్య వీరన్న ఎర్ర ఈరయ్య మెల్నాటి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు