
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ నడుపుతూ,ముందస్తు అడ్మిషన్లు తీసుకున్నటువంటి కార్పొరేట్ నారాయణ కాలేజీ ని సీజ్ చేయాలి.
పుల్లూరి సింహాద్రి PDSU జిల్లా అధ్యక్షులు
మీ న్యూస్ మార్చి 27::సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కార్పొరేట్ నారాయణ కాలేజ్ ముందస్తు అడ్మిషన్ చేస్తున్న నారాయణ కాలేజ్ ను సీజ్ చేయాలని PDSU ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి డీఈఓ భాను నాయక్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షులు పూల్లూరి సింహాద్రి మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేసవికాలం సెలవులలో నారాయణ కార్పొరేట్ కాలేజీలో తరగతులు నడపడంతో పాటు 2025-26 విద్యా సంవత్సరానికి ఎటువంటి అనుమతులు లేకుండా జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ నారాయణ కాలేజీ పేరుతో బోర్డులు ఏర్పాటు చేసి పట్టణం మరియు గ్రామాలలో తిరుగుతూ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని అన్నారు. అనుమతులు లేకుండా అడ్మిషన్ నిర్వహిస్తూ ఎటువంటి అకామిడేషన్ చూపించకుండా బ్రోచర్లలో ఫీజులను మెన్షన్ చేయకుండా తల్లిదండ్రుల అమాయకత్వంని ఆసరా చేసుకొని లక్ష నుంచి లక్షన్నర వరకు ఫీజు ఉందని చెప్పి ముందుగా అడ్వాన్స్ కట్టి స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రచారానికి దిగారని తెలిపారు. కావున తక్షణమే నారాయణ కాలేజ్ కార్పొరేట్ విద్యాసంస్థను పట్టణంలో,గ్రామాలలో ప్రచార రానికి రాకుండా ఉండాలంటే పర్మిషన్ ఇవ్వవద్దని అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కావున ఇదే విషయమై విద్యాశాఖ అధికారులు యాజమాన్యం వైఖరి పై స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.లేనియెడల పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దశలవారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో, ఉదయ్ మహేష్ నవీన్ వేణు పవన్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 55