సూర్య నమస్కార పోటీల్లో సూర్యాపేట యోగా సాధకుల ప్రతిభ

Uncategorized నల్లగొండ సూర్యాపేట

సూర్య నమస్కార పోటీల్లో సూర్యాపేట యోగా సాధకుల ప్రతిభ

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 10::రథసప్తమి సందర్భంగా వ్యాస మహర్షి యోగా సొసైటీ వారు ఈ నెల 9 ఆదివారం సిద్దిపేటలో నిర్వహించిన శత సహస్ర సూర్య నమస్కార ప్రదర్శన లో సూర్యాపేటకు చెందిన సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం నుండి 27 మంది సాధకుల్లో 15 మంది మహిళలు 10 మంది పురుషులు ఇద్దరు చిన్నారులు పాల్గొనగా అందులో P.నాగలక్ష్మి అనే సాదకురాలు 803 సార్లు సూర్య నమస్కారాలు చేసి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచినట్లు “సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం” యోగా గురువు చాడపాపిరెడ్డి సోమవారం తెలిపారు. అంతేకాకుండా పాల్గొన్న వారిలో ప్రతి ఒక్కరు 108 సార్ల పైగా సూర్య నమస్కారాలు చేసి ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. గత పది సంవత్సరాల నుండి వివిధ ప్రదేశాల్లో జరుగుతున్న యోగ పోటీల్లో పాల్గొని సూర్యాపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రము సాధకులు ఎన్నో బహుమతులు సాధించడం సూర్యాపేటకు గర్వకారణమన్నారు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ దిన చర్యలో భాగంగా యోగా కూడా అల వర్చుకోవాలన్నారు..