మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 4::సూర్యాపేట: విజ్ఞాన శాస్త్ర ఫలాలను సామాన్య ప్రజలకు అందించడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విశేష కృషి చేస్తుందని జనవిజ్ఞాన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోళ్ళమూడి రమేష్ బాబు అన్నారు.జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో భాగంగా జన విజ్ఞాన వేదిక ప్రత్యేకంగా తయారు చేసిన సైన్స్ క్యాలెండర్ ను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో కలిసి సూర్యపేట జిల్లా కేంద్రంలో రమేష్ బాబు ఆవిష్కరించారు.ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్తల ఫోటోలు మరియు వారి ఆవిష్కరణలతో కూడిన జై వివి సైన్స్ క్యాలెండర్ ను జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాలలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఉచితంగా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.సైన్సు , పర్యావరణ పరిరక్షణ, సమత , సామాజిక న్యాయం, విద్యా, సాంస్కృతిక రంగాలలో పలు విభిన్నమైన కార్యక్రమాలను జనవిజ్ఞాన నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూన్న ప్రతి సందర్భంలో, సమాజాన్ని నిత్యం చైతన్యవంతం చేయడంలో మీడియా మిత్రుల భాగస్వామ్యం వెలకట్టలేనిదని రమేష్ బాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, రిపోర్టర్లు అయితగాని రాంబాబు,బచ్ఛు పురుషోత్తం,పి, మల్లిఖార్జున్, వేణు, ఉయ్యాల నర్సయ్య,దుర్గం బాలు, తండు వెంకన్న,దోసపాటి అజయ్ లతో పాటు జనవిజ్ఞాన వేదిక సీనియర్ నాయకులు మరం నారాయణరెడ్డి, మహిళా కార్యదర్శి భట్టు సునీత, పల్లె ఝాన్సీ, గిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.