దివ్యాంగురాలు భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ ను సప్సెన్డ్ చేయాలి 

Uncategorized దివ్యాంగుల ధర్నా నల్లగొండ మోతే సూర్యాపేట

దివ్యాంగురాలు భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ ను సప్సెన్డ్ చేయాలి 

 

తహసీల్దార్ కార్యాలయం ఎదుట దివ్యాంగురాలు పులమ్మ ధర్నా 

 

మీ న్యూస్ ప్రతినిధి::మోతె మంగళ వారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట దివ్యాంగురాలు మట్టి పల్లి పూలమ్మ ధర్నా నిర్వహించార బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం గుంపుల తిర్మల గిరి గ్రామానికి చెందిన మట్టి పల్లి వెంకటా చలం తో రెండవ భార్య గా వివాహం కాగా తన కు 12 సంవత్సరాల బాబు ఉన్నాడని నా భర్త కు అన్న వ్యవసాయ భూమి సర్వే నెంబర్ 607/1 ,607/2, 608/3 ,701/2/3,701/2,గల సర్వే నెంబర్ లలో మోతె మండల పరిధిలోని నామ వరం గ్రామ శివారు లో పట్టా నెం టి 29130170478 కాగా ఖాతా నెంబరు822 లో సుమారు 7 ఎకరాల 10 గుంటల భూమి పై యునియన్ బ్యాంక్ లో మార్టిగేజ్ లో ఉన్నప్పటికీ ఒరిజనల్ పట్టా పాస్ బుక్ లేకుండా రెండవ భార్య అయిన నాకు తెల్వకుండ మొదటి భార్య అయిన బిడ్డలకు భూమి నీ పట్టా చేసి నాకు అన్యాయం చేసినట్లు వాపోతూ తెలిపింది కుటుంబ సభ్యుల దృవీకరణ పత్రం లేకుండా తప్పుడు పత్రాలు సృష్టించిన ఒక మీ సేవ నిర్వాహకుడి సహాయం తో ఐదు లక్షల రూపాయలు తీసుకొని పట్టా చేసిన తహసీల్దార్ ను వెంటనే సప్సెండ్ చేసి నాకు న్యాయం చేయాలని కోరుతూ భారత వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తో ధర్నాను చేశారు ఈ కార్యక్రమం లో జిల్లా అద్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి వీరమ్మ భిక్షం చంద్రయ్య సురేష్ వెంకన్న రాములు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు