36ఎల్,22ఎల్ పరివాహ రైతులు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించుట 

Uncategorized తెలంగాణ నల్లగొండ రాజాకియం సూర్యాపేట

36ఎల్,22ఎల్ పరివాహ రైతులు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించుట 

 

మీ న్యూస్ ప్రతినిధి ::×19-01-2025 నాడు 36ఎల్, 22ఎల్, మోతె, మునగాల, నడిగూడెం మోతె మండలాలకు చెందిన రైతులు మండలాల్లో 36ఎల్, 22ఎల్ కెనాల్ ద్వార నీటి సరఫరా జరుగుతుందని, ఇట్టి కెనాల్ ద్వార నీరు దాదాపు 16 నుండి 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి, దాదాపు 20 పిల్ల కాలువలను దాటుకుని మోతె, మునగాల, నడిగూడెం మండలాలకు నీరు చేరాల్సి ఉంటుంది. 20 పిల్ల కాలువలను దాటుకుని మోతె, మునగాల, నడిగూడెం మండలాలకు నీరు చేరే పరిస్థితి లేదు. ఈ మూడు మండలాలకు నీరు అందకా రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కావున అధికారుల పర్యవేక్షణతో మూడు మండలాల రైతులను ఆదుకోగలరని రైతులు, రామచంద్రపురం గ్రామము లోని మూసీ బ్యాక్ వాటర్ దగ్గర నుండి ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ అడివేముల తిమ్మాపురం గ్రామము వరకు సుమారుగా 4 కిలోమీటర్లు వాటర్ పంపింగ్ వలన మోతె, మునగాల, నడిగూడెం, మండలాల పరిధిలోని వ్యవసాయ భూములకు నీళ్లు వచ్చే విధంగా చేయాలని భారీ నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖమాత్యులు శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించాం. మంత్రి స్పందించి మూడు మండలాలకు నీళ్లు అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు