రేషన్ కార్డుల పై మంత్రి ఉత్తం కీలక ప్రకటన 

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

రేషన్ కార్డుల పై మంత్రి ఉత్తం కీలక ప్రకటన 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జనవరి 18 :::రేషన్ కార్డుల పై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హత ఉన్న అందరికీ రేషన్ కార్డు ఇస్తామని భరోసా ఇచ్చారు పాత రేషన్ కార్డు తీసివేస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కొట్టిపారేశారు పాత రేషన్ కార్డులు అలాగే ఉంటాయని అన్నారు పాత రేషన్ కార్డు లో కొత్త సభ్యులను చేరుస్తామని చెప్పారు కులగనన ఆధారంగా రేషన్ కార్డులో ప్రక్రియను ఉంటుందని లిస్టులో పేరు లేకపోతే ఆందోళన చెందొద్దని గ్రామ సభలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టత చేశారు మరోవైపు జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం చెప్పారని పంపిణీ ప్రక్రియల కోసం గ్రామాల్లో సర్వే సైతం గ్రామాల్లో సర్వే జరుగుతుందని చెప్పుకోవచ్చు అన్నారు రాష్ట్రంలో రాష్ట్రంలో రెండు కోట్ల 81 లక్ష మంది కి ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు అయితే ఈ విషయంపై ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు రేషన్ కార్డ్ అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారికి ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చని ఇది నిరంతరం ప్రక్రియ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు