మీన్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జనవరి18:::కోదాడ పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నవోదయ ఎంట్రన్స్ పరీక్ష కేంద్రంలో కొంతమంది ఇన్విజిలేటర్లు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు శనివారం పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవోదయ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించారు పరీక్ష సమయం కాగానే ఓఎంఆర్ షీట్ అందించారు ఇన్విజిలేటర్ విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ను బబ్లింగ్ చేశారు కానీ రావులపెంట మోక్షిత్ అనే విద్యార్థి రూల్ నెంబర్ 3612924 కాగా 9612924 గా బబ్లింగ్ చేయడంతో విద్యార్థి ఇన్విజిలేటర్ లో రూల్ నెంబర్ తప్పుగా దిద్దారు అని ప్రశ్నించాడు దీనితో ఇన్విజిలేటర్ 9 అంకెను గట్టిగా రఫ్ చేయడంతో రంద్రం పడిందని అనంతరం మూడు అంకెలు బబ్లింగ్ చేసిందని తెలిపాడు అదేవిధంగా జి గాయత్రి అనే విద్యార్థిని రూల్ నెంబర్ 3612963 ను కూడా తప్పుగా బబ్లింగ్ చేసినట్లు ఆరోపించారు విద్యార్థులు గత రెండు సంవత్సరాలుగా నవోదయ ఎంట్రన్స్ పరీక్ష కోసం శిక్షణ తీసుకున్నారు అని తెలిపారు తీరా పరీక్ష కేంద్రంలో వారి జీవితాలతో తప్పుడు హాల్ టికెట్ నెంబర్లు వేసి ఇన్విజిలేటర్లు చెలగాటం ఆడారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై సదరు నవోదయ సెంటర్ ఇన్విజిలేటర్ ను పరీక్ష నిర్వహకులను విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించగా ఏం చేస్తారో చేసుకోండి అని తెలిపారని వాపోయారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విషయాన్ని ఆరా తీశారు విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు పోలీస్ అధికారులు కోరుతున్నారు