సూర్యాపేట సబ్ డివిజన్ DSP కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ IPS 

Uncategorized క్రైమ్ నల్లగొండ సూర్యాపేట

 

 

సూర్యాపేట సబ్ డివిజన్ DSP కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ IPS 

క్షేత్రస్థాయి పర్యవేక్షణతో వేగంగా పోలీసు సేవలను అందించవచ్చు

 సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా

మీ న్యూస్. సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి.10::: జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ IPS  సూర్యాపేట సబ్ డివిజన్ DSP కార్యాలయాన్ని సందర్శించారు. ఎస్పి గారికి DSP రవి, డివిజన్ CI లు స్వాగతం తెలిపినారు. ముందుగా DSP కార్యాలయలో మొక్కలు నాటారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి పోలీసు సేవలు అందించాలని తెలిపారు. అనంతరం కార్యాలయం రికార్డ్స్, పరిసరాలు పరిశీలించి తనిఖీ చేశారు. డివిజన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ గురించి సమీక్షించారు, రౌడి షిటర్స్, సస్పెక్ట్ పై నిఘా ఉంచాలి ఆదేశించారు. కేసులు, పిర్యాదులు పెండింగ్ ఉంచకుండా క్షేత్ర స్థాయి పర్యవేక్షణ చేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్ లను, సర్కిల్ ఆఫీసుల పనితీరు పరిశీలించాలని DSP కి తెలిపారు. ఈ కార్యక్రమంలో మునగాల సీఐ  రాజేషేఖర్, వీర రాఘవులు, శ్రీను, రఘువీర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, DCRB SI యాకూబ్, ఎస్పి సీసీ సందీప్, DCRB సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .