అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి

Uncategorized అంతారం నల్లగొండ రాజాకియం సూర్యాపేట

అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి

 మేకల శ్రీనివాసరావు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్

 

మీ న్యూస్ సూర్యపేట జిల్లా ప్రతినిధి జనవరి 07:::: తెలంగాణ రాష్టం లో గల ICDS లో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ కు ప్రభుత్వం కనీస వేతనం 26 వేలు వేతనం ఇవ్వాలి. అని కలక్టరేట్ ముందు AITUC ఆధ్వర్యంలో ధర్నా చేసి జాయింట్ కలెక్టర్ రాంబాబు గారికి సమస్యలతో కూడిన వివిధ పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ

మినీ నుండి పదోన్నతి పొందిన వారికీ పెంచిన గౌరవ వేతనం 9 నెలలు పెండింగ్ లో ఉన్నాయి వాటిని తక్షణమే ఇవ్వాలి ని రెగ్యులర్ గా పెరిగిన వేతనం అందించాలి అంగన్వాడీ టీచర్స్ కు సూపర్వైజర్స్ పదోన్నతి కల్పించాలన్నారు. GP ఆప్ సడలించాలి, రిజిస్టర్ల పైన స్పష్టత ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న ఇంటి అద్దెలు గ్యాస్ బిల్స్ ఆరోగ్య లక్మి బిల్స్ , ఈవెంట్ బిల్స్ స్టేషనరీ బిల్స్ తక్షణం ఇవ్వాలని కోరారు.మెనూ ఛార్జిలు 10 ఏళ్ల క్రితం ఉన్న మార్కెట్ రేట్లు ప్రకారం ఉన్నాయి ప్రస్తుత మార్కెట్ లో కూరగాయలు ధరలు సరుకులు ధరలు ఆకాశాన్ని ఆంటుచున్నవి కావున గర్భిణీ కు బాలింతకు 20 రూపాయలు చిన్నారులుకు 15 రూపాయలు మెనూ పెంచాలని కోరారు అంగన్వాడీ కేంద్రాలుకు కరెంట్ ,త్రాగునీరు, మరుగుదొడ్లు, నూతన భవనాలు గర్భిణీ స్త్రీ లు కూర్చునేదుకు చైర్స్, సెంటర్ లకు వంట పాత్రలు, షొప్స్ , చాపలు, ఛార్ట్స్ అందించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు, 5 లక్షలు రూపాయలు GO అమలు చెయ్యాలి అని, కాళిగా ఉన్న టీచర్స్ & హెల్పర్స్ భర్తీ చెయ్యాలి అన్నారు. పై సమస్యలు పరిస్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపి సానుభూతి తో సమస్యలు పరిష్కరించి అంగన్వాడి టీచర్స్ & హెల్పర్స్ జీవితాలు లో వెలుగులు నింపాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ గుగులోతు రాజారాం తెలంగాణ అంగన్వాడి టీచర్ మరియు హెల్పర్ యూనియన్ నాయరాళ్లు గౌరోజు రమ, రేకల సుమిత్రాదేవి, బందెల భాగ్యమ్మ, ఆకుల సరస్వతి, శోభారాణి, పులుసు మంజుల జిల్లా నవనీత, హరిత కందుకూరి ఆండాలు, అంజలి సునంద, తదితరులు పాల్గొన్నారు.