మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 30 ::: జిల్లా పోలీసు అధికారులతో ఎస్పి సన్ ప్రీత్ సింగ్ పోలీసు అధికారుల నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ఈ సంవత్సరం అందరూ బాగా పని చేశారు, రాబోవు రోజుల్లో కూడా ఇలాగే ప్రజల మద్దతు పొందేలా పని చేయాలని కోరారు. కేసులు, పిర్యాదులు పెండింగ్ లేకుండా పని చేయాలని, నాణ్యమైన దర్యాప్తు చేయాలి, పిర్యాదులపై త్వరగా స్పందించాలి అని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కోరారు. నూతన సంవత్సర వేడుకలకు పట్టిష్ట బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కడ కూడా గొడవలు జరగకుండా పర్యవేక్షణ చేయాలని అన్నారు. పెట్రోలింగ్ చేయాలని అన్నారు. బహిరంగంగా మద్యం తాగితే కేసులు నమోదు చేయాలి. బాణాసంచా, డీజేలు నిషేధించాలి అని ఆదేశించారు.ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి, సూర్యాపేట సబ్ డివిజన్ డి.ఎస్.పి రవి , సైబర్ సెక్యూరిటీ డి.ఎస్ పి శ్రీనివాస రావు, ఏ ఆర్ డి ఎస్ పి నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ హరిబాబు, జిల్లాలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ లు ఎస్సైలులు, బిసిఆర్బి ఐటీ కోర్ సిబ్బంది ఉన్నారు.