===తెలంగాణ జూనియర్ ప్రీమియర్ లీగ్ లో తాండూరు విద్యార్థుల సత్తా
===తాండూరు జట్టుకు చెందిన రాథోడ్ అంకుశ్ ఉత్తమ బ్యాటర్గా,
===శివ శంకర్ 8 డిస్మిజల్స్ తో ఉత్తమ కీపర్ అండ్ ఫీల్డర్ గా నిలిచారు.
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 27:::: తెలంగాణ జూనియర్ ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి అండర్-16 t-20 క్రికెట్ టోర్నమెంట్ లో తాండూరు లోని సహారా క్రికెట్ అకాడమీ జట్టు సత్తా చాటింది.హోరాహోరి పోటీలో రన్నరప్స్ గా నిలిచారు.ఈనెల 23 నుండి 27 వరకు హైదరాబాద్ లో జరిగిన పోటీల్లో 8 జట్లు పాల్గొన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి , హైదారాబాద్, వికారాబాద్ నుండి తాండూరు కి చెందిన సహర క్రికెట్ అకాడమి జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నీలో తాండూరు జట్టుకు చెందిన రాథోడ్ అంకుశ్ ఉత్తమ బ్యాటర్ (255పరుగులు) గా, శివ శంకర్ 8 డిస్మిజల్స్ తో ఉత్తమ కీపర్ అండ్ ఫీల్డర్ గా నిలిచారు. సహారా క్రికెట్ అకాడమీ కోచ్ జగన్నాథ్ రెడ్డి , తల్లిదండ్రులు, పలు పాఠశాలల యాజమాన్యాలు ప్లేయర్స్ కి అభినందనలు తెలిపారు…