మన్మోహన్ సింగ్ మరణం దేశాని కి దిగ్భ్రాంతి గురి చేసింది
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 27:: మాజీ ప్రధానమంత్రి ప్రపంచంలో నే గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త మన్మోహన్ సింగ్ మరణం దేశం యావత్తు కు దిగ్బాంతి గురిచేసిందని సుధా బ్యాంకు చైర్మన్ మీలా మహదేవ్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేశ్ తెలిపారు. శుక్రవారం సుధా బ్యాంకు ఆవరణలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి వేసి పూల మాలలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ఆర్థిక సరళీకృత విధానాలను భారత దేశంలో అనుసరింపజేసి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షింపజేసి పునారిల్లుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి దేశ ప్రధానిగా ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఈ రోజున భారతదేశ ప్రపంచంలోనే ఐదవ గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడానికి బీజాలు వేసి, పునాదులు వేసి క్రమశిక్షణ ,ఆర్ధిక వైద్యుడిగా ఎంతో పరిజ్ఞానం కలిగి మన దేశానికి ఎనలేని సేవలు చేశారని అందుకు సుధ బ్యాంకు ఘనమైన నివాళులర్పిస్తుంది అని అన్నారు. వారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా జీవితాంతం ఆర్థిక రంగంలో పనిచేసి దేశానికి ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి వారు చేసిన సేవలను భారతదేశము కొనియాడుతు నివాళులు అర్పిస్తుందని తెలిపారు. అమలు లో అన్న ఆధార్ కార్డు, సమాచార హక్కు చట్టం మొదలైనవి ఎన్నో కొత్త విధానాలను ప్రవేశపెట్టి ప్రపంచ పటంలో భారతదేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టాలని గుర్తించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్లు రవీందర్ రెడ్డి మాధవి, సైదులు, సిబ్బంది ఖాతాదారులు పాల్గొన్నారు.