చలో హైదరాబాద్ ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న మల్టీపర్పస్ వర్కర్స్

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట హైదరాబాద్

చలో హైదరాబాద్ ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న మల్టీపర్పస్ వర్కర్స్

 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 16 :: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ GP ఉద్యోగ కార్మిక సంఘాల JAC ఆధ్వర్యం మంగళవారం చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయాలని GP కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల రవిచంద్ర కోరారు. మోతేలో GP కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బొమ్మగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ నెల 20 తర్వాత ఏరోజు నుండైనా సమ్మెకు సిద్ధంగా ఉండాలని వారు అన్నారు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి మరియు పంచాయతీరాజ్ మినిస్టర్ దానసరి సీతక్క గారికి వినతి పత్రం సమర్పించాం అని అన్నారు ముఖ్యంగా పంచాయతీ ఉద్యోగ కార్మికుల మెడకు ఉరితాడుగా ఉన్న మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దుకై 51 జీవో సవరణ కారోబార్ బిల్ కలెక్టర్ల ప్రత్యేక స్టేటస్ రెండో పి ఆర్ సి అమలలో కార్మికులను పరిగణలోకితీసుకోవాలని రాష్ట్రంలో ఇప్పటివరకు బకాయి పడిన వేతనాలు ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించి నేరుగా చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అందర్నీ పర్మినెంట్ చేయాలని తదితర డిమాండ్లతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా. ఇందిరాపార్కులో ఈనెల 17న చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా “బహిరంగ సభ ‘ కలదు ఈ సమావేశంలో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నందున రాష్ట్రంలోని గ్రామపంచాయతీ లో పనిచేయుచున్న అన్ని తరగతుల సిబ్బంది మరియు కారోబార్లతో సహా హాజరై విజయవంతం చేయాలని వారు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొమ్మగాని వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు వడపంగి లక్ష్మీనారాయణ, పరశురాములు గురవయ్య స్కైలాబు సైదులు మరియు గ్రామపంచాయతీ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు