వరి కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక  తనిఖీలు 

Uncategorized తాండూర్ బషీరాబాద్ యాలల వికారాబాద్ వ్యవసాయం

వరి కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక  తనిఖీలు 

 యాలాల. బషీరాబాద్ మండలలో వరి కొనుగోలు కేంద్రాల పరిశీలన

 

 అక్కంపల్లి, చెన్నారం గ్రామాలలో అంగన్వాడి సెంటర్, ప్రాథమిక ఉన్నత పాఠశాలను తనిఖీ 

 

జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ మరియు తాండూర్ సబ్ కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు 

 మీ న్యూస్ల్ ప్రతినిధి:::: వికారాబాద్ జిల్లా బషీరాబాద్/ యలాల మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ మరియు తాండూర్ సబ్ కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. బషీరాబాద్ మండలంలోని కాసింపూర్ లో శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు వారు పండించిన వడ్లను బాగా ఎండబెట్టి తేమతో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకురావాలనీ, కొనుగోలు కేంద్రం దగ్గర రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలనీ అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన సన్నవడ్లకు క్వింటాలుకు 500.రూపాయలు ప్రభుత్వము బోనస్ గా ఇవ్వడం జరుగుతుందనీ కలెక్టర్ అన్నారు. అదేవిధంగా యాలాల మండల పరిధిలోని అగ్గనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తనిఖీ చేసి మధ్యాహ్న భోజన నిర్వహణతో పాటు పాఠశాలల్లో ఉన్న సమస్యలను విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. అదేవిధంగా తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అక్కంపల్లి, చెన్నారం గ్రామాలలో పర్యటించి అంగన్వాడి సెంటర్, ప్రాథమిక ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం వడ్ల కొనుగోలు కేంద్రాలను సబ్ కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదనపు కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ వెంబడి మండల స్థాయి అధికారులు ఉన్నారు. అగ్గనూరు ఉన్నత పాఠశాలలో వంటగది సరిపోక విద్యార్థులకు చెట్ల కిందనే మధ్యాహ్న భోజనాన్ని వండి వడ్డించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ దృష్టికి నిర్వాహకులు పాఠశాల సిబ్బంది తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.