
రెడ్ క్రాస్ సౌసైటీ సేవలు ప్రశంసనీయం
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్


మీ న్యూస్ ప్రతినిధి
విశాఖపట్టణం, నవంబర్ 15 ః అత్యవసరంలో ఉన్న వారికి, తలసేమియా చిన్నారులకు సమయానికి రక్తాన్ని సరఫరా చేయడం, ఉచిత రక్త మార్పిడి, మందుల పంపిణీ వంటి కార్యక్రమాలను చేపడుతున్న రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో మహారాణిపేట ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అక్కడ పరిస్థితులను గమనించారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అందుతున్న సేవల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అదే భవనంలో నిర్వహిస్తున్న తలసేమియా కేంద్రాన్ని సందర్శించిన ఆయన వ్యాధితో బాధతపడుతున్న చిన్నారులను పరామర్శించి తల్లిదండ్రులతో మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన దాతలను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు.కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఛైర్మన్ డా. వైఎస్ శివ నాగేంద్ర రెడ్డి, రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా ఛైర్మన్ టి.ఆర్. మక్సూద్ అహ్మద్, రౌండ్ టేబుల్ ఇండియా ప్రతినిధులు, రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొనరు.