మీ న్యూస్ ప్రతినిధి :::వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఈనెల నాలుగో తేదీన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు న్యాయవాది (ఉద్యమకారుడు) జిలాని బాబు మరియు భార్యతో కలిసి బైక్ పై వెళ్తుండగా హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఖాoజాపూర్ గేట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి న్యాయవాది జిల్లాని కుమారునికి మెరుగైన చికిత్స చేయించాలని అన్నారు. జిలాని కుటుంబ సభ్యులను పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హబీబ్లాల, కౌన్సిలర్లు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ బంటు వేణు సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు పిఎసిఎస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ స్థానిక కౌన్సిలర్ వెంకన్న గౌడ్ కౌన్సిలర్ బి. రవి రాజ్ 8 వ వార్డ్ కాంగ్రెస్ నాయకులు ఇన్నాయత్ పాషా వాజిద్ అమీనా బేగం కవిత యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.