–ఈనెల 17, 24 హైదరాబాద్ డిపో -2 నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు
–=తాండూరు డిపో మేనేజర్ సురేష్ కుమార్
మీ న్యూస్ ప్రతినిధి :::తాండూరు: పరమ శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తిక మాసం సందర్భంగా శబరిమల, పంచారామ శైవక్షేత్రాలను సందర్శిన భక్తుల కోసం ఈనెల 17, 24 తేదీల్లో హైదరాబాద్ డిపో -2 నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సురేష్ కుమార్ తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5గంట లకు హైదరాబాద్ డిపో నుంచి బయల్దేరుతుందన్నారు. అమరావతి (అమరేశ్వరాలయం), భీమవరం (సోమేశ్వరాలయం), పాలకొల్లు (క్షీర రామలింగేశ్వరాలయం), ద్రాక్షారామం (భీమేశ్వరాలయం), సామర్లకోట (కుమార రామ భీమేశ్వరాలయం) క్షేత్రాల సందర్శన ఉంటుందని) తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నం. 99592 25253, 99592 26249 లేదా www.tgsrtcbus .in లో సంప్రదించాలని, బస్సు టికెట్లు బుక్ చేసుకుని సురక్షితమైన ప్రయాణం చేయాలని కోరారు.