మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 26::నూతనకల్ ప్రభుత్వం నిర్ణయించిన తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తహసిల్దార్ శ్రీనివాసరావు అన్నారు శనివారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఎర్ర పహాడ్ లో ఏర్పాటు చేసిన ధాన్యపు కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని తూర్పాల పట్టి , ప్రభుత్వం నిర్ణయించిన తే శాతం ఉంటే వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు కొనుగోలు అయినా వెంటనే ట్యాబ్ లో నమోదు చేయాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులను నష్టపరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వారి వెంట ఎంపీడీవో సునీత వ్యవసాయ శాఖ మండల అధికారి మురళి కొనుగోలు నిర్వాహకులు తదితరులు ఉన్నారు,