పేద ముస్లిం కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి క్ర్రపాకర్
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి 15:::విద్యానగర్ 45 వ వార్డులో నివాసం వుంటున్న పేద ముస్లిం కుటుంబం ఫయినుద్దిన్ రేష్మ ల కుమార్తె సీమ వివాహం జనవరి నెల 23 వ తేదిన జరగనుంది. సీమ వివాహనికి అయ్యే ఖర్చులకు సహాయం చేయవలసిందిగా వారి కుటుంబ సభ్యులు బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి క్ర్రపాకర్ గారిని సంప్రదించారు. బుధవారం నాడు తనను కలిసిన సీమ కుటుంబ సభ్యులకు 10,000/- నగదును గండూరి క్ర్రపాకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ముస్లిం కుటుంబంలో వివాహం సందర్భంగా జరిపే ఖర్చులకు తనవంతు సహాయం చేస్తున్నట్టు చెప్పారు. మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేదింటి ముస్లిం కుటుంబంలో ఆడ కూతురు వివాహం జరిపితే షాది ముబారక్ పధకం ద్వారా లక్ష రూపాయలు ప్రభుత్వం నుండి అనేక కుటుంబాలకు అందించారని, వారికి ఈ సందర్భంగా. వార్డుకు చెందిన పలువురు గండూరి క్ర్రపాకర్ గారికి అభినందనలు తెలిపారు.