Uncategorized

స్టేట్ ఫైనాన్స్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన రమేష్
– ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి రమేష్ కు శుభాకాంక్షలు తెలిపారు
– రమేష్ మహారాజ్ ను సన్మానించిన కాంగ్రెస్ లీడర్స్

దీక్షతెలుగున్యూస్ , తాండూరు :

స్టేట్ ఫైనాన్స్ సభ్యుడిగా నియమితుడైన రమేష్ మహారాజ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.హైదరాబాద్ నగరంలో స్టేట్ ఫైనాన్స్ కమీషన్ కార్యాలయంలో ఐఏఎస్ స్మిత సభర్వాల్ సమక్షంలో ఛైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య, సభ్యులుగా రమేష్ మహారాజ్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తోపాటుపలువురు కాంగ్రెస్ లీడర్స్, నేతలు రమేష్ మహారాజ్ ను సన్మానించి, పుష్ప గుత్తులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రమేష్ మహారాజ్ మాట్లాడుతూ..కష్టకాలంలోకూడాకాంగ్రెస్నినమ్ముకొని,పనిచేసిన వారందరికీ పార్టీ గుర్తించి తగిన ప్రార్ధన లభిస్తుందని భరోసా ఇచ్చారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ తోపాటు 10 పైగా లోక్ సభ స్థానాలు గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.ఈ సందర్భంలో రోహిత్ మహరాజ్ , పెద్దాముల్ జడ్పీటీసి ధార సింగ్, ఉత్తమ్ చంద్, జనార్ధన్ రెడ్డి, నగప్ప, జగదీష్, గోపాల్,నర్సి రెడ్డి, నర్సిముల్,లక్ష్మణ్ పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.