అసెంబ్లీలో తాండూరు గొంతు..
– మొదటిసారి మనోహర్ రెడ్డి సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించారు
– కంది బోర్డు ఏర్పాటు, రాయల్టీ తప్పించాలి..
– విద్యారంగానికి పెద్ద పీట వేయాలి
– సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు
దీక్షతెలుగున్యూస్,తాండూరు :
మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి
తాండూరు ప్రాంత వివిధ సమస్యలపై
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమస్యల పై మాట్లాడుతూ.. తాండూరు పరిసర ప్రాంతాల్లో విస్తారమైన ఖనిజ సంపద నిలయంగా తాండూరు నియోజకవర్గం ఉందని ఇక్కడ లభించే సుద్ద,నాపరాతి తో అనుసంధానంగా చాలా వరకు పరిశ్రమలు పరిసర ప్రాంతాల్లో ఉండటంతో సుమారు 15000 మంది కి ఉపాధి లభిస్తుందని ప్రస్తావించారు.రాయల్టీ తగ్గించాలి..అయితే సుద్ద భూముల లీజల విషయం లో కాని రాయల్టీ చెల్లింపు లో కాని పొరుగు రాష్ట్రం కర్ణాటక తో పోలిస్తే ఇక్కడ అధిక మొత్తంలో ఖర్చు అవ్వడం తో వ్యాపారస్తులకు భారంగా మారి వ్యాపారులు చేయలేకపోతున్నారు.కాబట్టి ఈ ప్రాంతం లో ఉపాధి పొందుతున్న చాలా మంది కార్మికులకు ఇబ్బందిగా మారిందని అన్నారు.ప్రభుత్వం దృష్టి సారించి రాయల్టీ మరియు గనుల లీజు విషయంలో వ్యాపారస్తులకు కార్మికులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని సభా దృష్టికి తీసుకెళ్లారు.విద్యారంగానికి పెద్దపీట వేయండి..అలాగే నియోజకవర్గం లో సాగు నీటి ప్రాజెక్టులు అయిన జుంటుపల్లి, కోట్ పల్లి ప్రాజెక్టులకు అధిక మొత్తంలో నిధులు కేటాయింపు చేసి త్వరగా పనులు పూర్తి చేసే విధంగా చూడాలని ప్రస్థావించడం జరిగిందన్నారు.విద్యారంగానికి సంబంధించిన తాండూరులో ఐటిఐ కళాశాల మౌలిక సదుపాయాలతో పాటు మైనింగ్ కళాశాల ఏర్పాటు చేసే విధంగా చూడాలని బషీరాబాద్ లో కేవలం జీవోలకే పరిమితం అయిన జూనియర్ కళాశాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యే విధంగా చూడాలని ఎమ్మెల్యే కోరారు.తాండూరుకు కంది బోర్డు కావాలి..తాం
డూరు ప్రాంతంలో పండే కంది పంటకు భౌగోళిక గుర్తింపు పొందిన ఇక్కడ ఉన్న రైతులకు మేలు జరగాలంటే కంది బోర్డు తో పాటు వాళ్ళని ఆర్థరైడ్జ్ యూజర్స్ గా గుర్తించాలని సభ లో ప్రస్తావించారు. దీంతో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గం లో చాలా సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి దృష్టికీ తీసుకెళ్ళి దశాల వారిగా సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.