బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ
జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి
బీసీ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడుకలు
మీ:: న్యూస్ ప్రతినిధి
గాంధీజీ స్ఫూర్తితో భారత దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అవే విలువలను తమ జీవితాంతం పాటించి స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది నిబద్ధత కలిగిన రాజకీయవేత్త తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ దేశం గర్వించదగ్గ నేత అని జాతీయ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ అన్నారు తాండూర్ RDO కార్యాలయం ఆవరణలో ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు బీసీ నాయకులు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మనీయమని కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ క్విట్ ఇండియా నాన్ ముల్కి తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని బహుభాషా గోవిందుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితాంతం బడుగు బలైన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని రాజకుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బి సి నాయకులు సయ్యద్ శుకుర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, విద్యావంతులు రామకృష్ణ, స్వెరోస్ ప్రెసిడెంట్ శివకుమార్, సిఐటియు నాయకులు శ్రీనివాస్, బుగ్గప్ప, యాలాల మండల అధ్యక్షులు లక్ష్మణాచారి, తాండూర్ మండల అధ్యక్షులు బసంత్ కుమార్ బీసీ యువ నాయకులు జుంటుపల్లి వెంకట్, రాము ముదిరాజ్, టైలర్ రమేష్, బసవరాజ్, దత్తాత్రేయ, సురేష్, పరమేష్, శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.