తోటి జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం 

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

తోటి జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం 

మీ న్యూస్ ప్రతినిధి ఆనంతుల చంద్రయ్య నూతనకల్.. ఇటీవల మండల కేంద్రానికి చెందిన బోయిల్ల చంద్రశేఖర్ ఆత్మకూర్ ఎస్ లో నమస్తే తెలంగాణ దినపత్రిక జర్నలిస్టు గా పని చేసి అనారోగ్యంతో మృతి చెందాడు .ఆదివారం మండల కేంద్రంలో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన తోటి జర్నలిస్టు లు విరాళాలు సేకరించి (108,000 ) ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలను వారి కుటుంబానికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 15 సంవత్సరాలు గా పనిచేసి పత్రిక పరంగా మండలంలోని ప్రజలకు సేవలు అందించారని సేవలను కొనియాడారు .మృతనీ కుటుంబానికి ఎల్లవేళలా సహకారం అందిస్తామని వారన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు భూపతి రాములు ,జలగం మల్లేష్, జంగా జానయ్య, మడ్డి మల్లేష్, సుందర్, ఎరుకల సైదులు, మేడి కృష్ణ, జెల్లా రాములు, స్థానిక జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.