కామెడీ విలన్ ఫిష్ వెంకటేష్ ను పరామర్శించిన ఎల్గూరి పాండు గౌడ్

Uncategorized తెలంగాణ నల్లగొండ సూర్యాపేట హైదరాబాద్

కామెడీ విలన్ ఫిష్ వెంకటేష్ ను పరామర్శించిన ఎల్గూరి పాండు గౌడ్

దుమారం సినిమా ప్రొడ్యూసర్, ఆస్పత్రిలో చికిత్స పొందుతూన ఫిష్ వెంకటేష్ పరామర్శించారు. 

త్వరగా కోలుకొని మళ్లీ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ఆకాంక్షించారు. 

మీ:: న్యూస్ ప్రతినిధి  సినిమాలలో కామెడీ విలన్ గా పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన ఫిష్ వెంకటేశ్ అనారోగ్యంగా ఉండడంతో సూర్యాపేటకు చెందిన దుమారం సినిమా ప్రొడ్యూసర్, విలన్ పాత్ర ధారి ఎల్గూరి పాండు గౌడ్ హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో పరామర్శించారు. ఫిష్ వెంకటేష్ కు రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం ఆసుపత్రిలో ఫిష్ వెంకటేష్ ను కలసి ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో చిత్రాల్లో నటించి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించిన ఫిష్ వెంకటేష్ అనారోగ్యంతో ఉండడంతో ఆసుపత్రిలో పరామర్శించినట్లు తెలిపారు. త్వరగా కోలుకొని మళ్లీ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ఆకాంక్షించారు. పలువురు సినీ నటులు సైతం ఫిష్ వెంకటేష్ కు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.