—మృతి చెందిన వ్యక్తికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు
—ఆసుపత్రికి తరలిస్తున్న మార్గ మద్యలోని మృతి
—-నామవరం గ్రామానికి చెందిన నవీన్ రెడ్డి మృతి
మీ న్యూస్ ప్రతినిధి ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు విపరీతంగా ఎక్కువై పోయాయి. ముఖ్యంగా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ఎన్నో సమస్యలను ఎంతో మంది ఎదుర్కొంటున్నారు. వాటిలో గుండె పోటు కూడా ఒకటి. ఈ గుండె పోటు అనేది పెద్ద సమస్య. చాలా మంది ప్రజలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.వివరాలకు వెళ్తే మోతే మండలం నామవరం గ్రామానికి చెందిన సరసాని నవీన్ రెడ్డి గురువారం సాయంత్రం గుండెపోటు రావడంతో సూర్యాపేటలో తీసుకెళ్తుండగా మాకు మధ్యలో మరణించడం జరిగింది, మరణించిన వ్యక్తికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు, మరణ వార్త తెలుసుకున్న గ్రామ ప్రజలు చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరమని తెలిపారు