—సెప్టెంబర్ 15నుండి సిపిఎం గ్రామ శాఖ మహాసభలు నిర్వహించాలి
—- సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు
మేతే సెప్టెంబర్12 మీ:: న్యూస్ ప్రతినిధి
మోతే: సెప్టెంబర్ 13 నుండి17 వరకు జరిగే తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వాటిని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు అన్నారు.గురువారం మోతే కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సిపిఎం పార్టీ మోతే మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూతెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగాసెప్టెంబర్ 13 నుండి 17 వరకు జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సాయుధం పోరాట వార్షికోత్సవ సభలు నిర్వహిస్తున్నామన్నారు.ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో శౌర్య యాత్ర తెలంగాణ సాయుధ పోరాట కేంద్రాల్లో నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టు లేనని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లిం వ్యతిరేక పోరాటంగాబిజెపిచిత్రీకరిస్తుందన్నారు. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో ముస్లింలు ముఖ్యమైన పాత్ర వశించారని అన్నారు. సాయిధ పోరాటాన్ని వక్రీకరించేందుకు బిజెపి కుట్రలు చేస్తుందని ఆ కుట్రలను ప్రజలంతా తిప్పి కొట్టాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నడిపే నైతిక అర్హత బిజెపికి లేదన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాల్లో వరదలు సంభవించాయని దీని మూలంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది మరణించారని అన్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అసంఖ్యాక ప్రజానీకం నిరాశ్రయులయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులు, వాగులు కట్టలు తెగడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయని అన్నారు. రహదారులపైకి నీరు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. వరదల కారణంగా అల్లాడిపోతున్న బాధిత ప్రజలను ఆదుకోవడానికి తక్షణమే ప్రభుత్వం అన్ని రకాల చర్యలనూ తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున వాటి నివారణకు తాత్కాలిక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో గండ్లుపడిన, కట్టలు తెగిన చెరువులతోపాటు దెబ్బతిన్న రహదార్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను అంచనా వేసి నష్టపరిహారం చెల్లించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ గ్రామ శాఖ మహాసభలు ఈనెల 15 నుండినిర్వహిస్తున్నామన్నారు. అక్టోబర్ లో మండల మహాసభలు, డిసెంబర్ లో జిల్లా మహాసభలు నిర్వహిస్తామన్నారు.సిపిఎంమండల కమిటీ సభ్యులు చర్లపల్లి మల్లయ్య అధ్యక్షతన జరిగినఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు కిన్నెర పోతయ్య,బూడిద లింగయ్య,బానోతు లచ్చిరాం,గుగులోతు కృష్ణ, దోస పాటి శ్రీను,సోమ గాని మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.