--మీడియా సమావేశంలో హత్య కేసు వివరాలను వెల్లడించిన తాండూర్ డిఎస్పీ బాలక్రిష్ణా రెడ్డి
మీ::న్యూస్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ దొంగతనాలకు అలవాటు పడిన ఇద్దరు స్నేహితులు మరో స్నేహితుని స్నేహం చేసుకొని దొంగతనం చేసిన వస్తువులను పంచుకోవడంలో తేడా రావడంతో కొత్తగా స్నేహం చేసిన స్నేహితుడిని హతమార్చి న సంఘటన పెద్దేముల్ మండల పరిధిలో చోటుచేసుకుంది.
ఈ కేసును చేదించి నిందితులను రిమాండ్ కు సబ్ డివిజన్ పోలీసులు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాండూర్ డిఎస్పి బాలక్రిష్ణా రెడ్డి పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని గోపాల్ పూర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి సుద్ధ గుంతలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పెద్దేముల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసు యొక్క దర్యాప్తులో భాగంగా ఇద్దరు వ్యక్తులు సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్, రుద్రారం గ్రామానికి చెందిన నరేష్ లను అనుమానంతో అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించగా శ్రీకాంత్, నరేష్ లు ఇద్దరూ తరచుగా దొంగతనాలు చేస్తూ పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దొంగతనాలకు పాల్పడుతున్న వీరు రుద్రారం గ్రామానికి చెందిన రమేష్ తో స్నేహం చేసుకొని పలు దొంగతనాలకు పాల్పడ్డారు. ఒక కారులో కెమెరాను దొంగిలించగా , మరో దగ్గర కల్లు కాంపౌండ్ లో 13 లిక్కర్ క్వార్టర్ బాటిల్లను దొంగిలించారు. ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్న వీరు ఓ రోజు దొంగతనాల వాటాల కోసం గోపాల్పూర్ గ్రామ శివారులో సుద్ధ గని వద్ద వాటాలను పంచుకునేందుకు సిద్ధమయ్యారు. వాటాలలో లిక్కర్ వాటర్ బాటిల్లో 13 ఉండగా అందులో చనిపోయిన వ్యక్తి రమేష్ కు ఆ ఇద్దరి స్నేహితుల మధ్య విభేదాలు రావడంతో గొడవకు దారితీసింది. దొంగతనం విషయంపై తనకు మద్యం సీసాలు ఎక్కువగా ఇవ్వకుంటే అందరికీ చెప్తానని స్నేహితులతో తగాదాకు దిగాడు. దీంతో ఇద్దరు స్నేహితులు శ్రీకాంత్ ,నరేష్ ఇక్కడ బయట పడుతుందో అని ఆవేశంతో రమేష్ ను బెల్టుతో గొంతుని నులిమి హత్య చేశారు. నిందితులు పోలీసుల విచారణలో ఇద్దరు హత్య చేసినట్లు ఒప్పుకొనగా , నిందితుల దగ్గర నుండి మద్యం సీసాలు, ఒక కెమెరా, హత్యకు ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రిమాండ్ కు తరలించారు. ఈ హత్య కేసులో త్వరలో చేదించినందుకు డిఎస్పి పోలీసులను అభినందించారు. ఈ కార్యక్రమం తాండూర్ రూరల్ సీఐ డి అశోక్ పేద్దేమూల్ ఎస్సై గిరి తదితరులు పాల్గొన్నారు